చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి క్రిప్టిక్ హింట్ తో ఫ్యాన్స్ ని కంగారులో పడేశాడు. నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా టాస్ వేసేందుకు వచ్చిన ధోనిని కామేంటేటర్ డేనీ మోరిసన్ పలకరించాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో హోరెత్తి పోయేలా ధోని కోసం అరుస్తున్న అభిమానులను చూసి ధోనితో నవ్వుతూ వచ్చే సీజన్ కూడా నీ కోసం ఇలాగే అరుస్తారంటావా అని ప్రశ్నించాడు. దానికి ధోని కూడా నవ్వుతూ వచ్చే సీజన్ వరకూ ఎందుకు నేను నెక్ట్స్ మ్యాచ్ ఆడతానో లేదో కూడా తెలియదు అని నవ్వేశాడు. ఇది క్రిప్టిక్ మెసేజ్. ధోనీ అన్న మాటలను అనలైజ్ చేస్తే..నిన్న పంజాబ్ పై ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ నుంచి అఫీషియల్ గా ఎలిమినేట్ అయిపోయింది. సో చెన్నైకి ఈ సీజన్ లో మిగిలిన నాలుగు మ్యాచుల్లో వాళ్లు కావాల్సినన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే యంగ్ స్టర్స్ షేక్ రషీద్, ఆయుష్ మాత్రేలను ఓపెనర్లుగా దింపి ప్రయోగాలు చేస్తోంది చెన్నై. వాళ్లు ఫెయిల్ అవుతున్నా కూడా వరుసగా అవకాశాలను కల్పిస్తోంది. వచ్చే సీజన్ నాటికి కాస్త్ వాళ్లకు ఎక్స్ పీరియన్స్ వస్తుందనే దృష్టితో ఈ తరహా ప్రయోగాన్ని చేస్తోంది చెన్నై. అటు అన్షుల్ కాంభోజ్, డెవాల్డ్ బ్రూయిస్ లాంటి వాళ్లకు ఛాన్స్ లు ఇచ్చింది. ఇక మిగిలింది వికెట్ కీపర్ బ్యాటర్ వంశ్ బేడీ. ఈ సీజన్ కోసం మెగా ఆక్షన్ లో 55 లక్షలు పెట్టి వంశ్ బేడీని బ్యాకప్ వికెట్ కీపర్ గా కొనుక్కుంది చెన్నై. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో 185 స్ట్రైక్ రేట్ తో మెరిసిన 22ఏళ్ల ఈ కుర్రాడు వచ్చే నాలుగు మ్యాచ్ లకు వికెట్ కీపర్ గా ఆడే అవకాశం కనిపిస్తోంది. అందుకోసం ధోనీ తన స్థానాన్ని వదులుకుంటాడా చూడాలి. ఒకవేళ ధోనీ కాదంటే కెప్టెన్సీ బాధ్యతను జడేజా చూసుకుంటాడా లేదా ఎవరైనా యంగ్ స్టర్ కి నాయకత్వ బాధ్యతలు అందుతాయా వేచి చూడాలి. వచ్చే నాలుగు మ్యాచుల ప్రదర్శన ఆధారంగా టీమ్ పై ఓ అంచనాకు రావటంతో పాటు వచ్చే సీజన్ అసలు తను ఆడాలా వద్దా అనే నిర్ణయాన్ని మాహీ తీసుకోవాలనకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రైనా లాంటి మాజీ ఆటగాళ్లు ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడతాడని టీమ్ సెట్ చేసి రిటెర్మైంట్ ఇస్తాడని తనకు టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉందని చెబుతున్నా..ధోని సడెన్ గా తీసుకునే నిర్ణయాలు తనకు తప్ప ఎవ్వరూ ఊహించను కూడా లేరు కాబట్టి..44ఏళ్ల వయస్సులో వచ్చే సీజన్ ఆడతాడా లేదా 18ఏళ్ల ఐపీఎల్ అనుబంధానికి..21 ఏళ్ల సుదీర్ఘ క్రికెటింగ్ కెరీర్ కి స్వస్తి పలుకుతాడా ధోని ఏం చేస్తాడనేది చూడాలి.
Category
🗞
News