నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా మ్యాచ్ ల తర్వాత ఓ భారీ స్కోరును పెట్టగలిగింది. కనీసం 190 స్కోరును CSK కొట్టింది అంటే ఏకైక రీజన్ కడైకుట్టి సింగం అని చెన్నై అభిమానులు ముద్దుగా పిలుచుకునే శామ్ కర్రన్. నిన్న పంజాబ్ పై మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు కొండంతా అండలా మారి 47బాల్స్ లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 88 పరుగులు చేసి అవుటయ్యాడు శామ్ కర్రన్. దూకుడు ఆడేందుకు యత్నించి అవుటయ్యాడు లేదంటే నిన్న మనోడు చూపించిన దూకుడుకు సెంచరీ చేసేసేవాడు. అయితే శామ్ కర్రన్ కు దూకుడుకు కారణం ఏంటీ. రెండు రీజన్స్ కనిపిస్తున్నాయి. ఈ సీజన్ లో తన పాత జట్టుకు చెన్నైకి వచ్చిన శామ్ కర్రన్ కి పెద్దగా ఆడే అవకాశాలు అయితే రాలేదు. స్టార్టింగ్ లో రెండు మ్యాచ్ లు ఛాన్స్ ఇచ్చిన చెన్నై ఆ మ్యాచుల్లో ఫెయిల్ అవ్వటంతో కర్రన్ ను పక్కన పెట్టేసింది. మళ్లీ చెన్నై పూర్తిగా ఫెయిల్ అయిన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో అవకాశాలు ఇచ్చింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓ హాఫ్ సెంచరీ కొట్టాడు శామ్ కర్రన్. పైగా నిన్న తన ప్రత్యర్థి పంజాబ్ నిన్న మొన్నటి వరకూ శామ్ కర్రన్ కు సొంత జట్టు. 2023, 24 సీజన్లలో పంజాబ్ కే ఆడిన శామ్ కర్రన్..అప్పట్లో ధవన్ కెప్టెన్సీ బాధ్యతలు వదిలేయటంతో నాయకుడిగా జట్టును నడిపించాడు. మెగా ఆక్షన్ లో పంజాబ్ శామ్ కర్రన్ ను వదిలేయటంతో చెన్నై మళ్లీ తమ పాత ఆటగాడిని కొనుగోలు చేసుకుంది. సో కెప్టెన్ గా ఉన్న తనను కొనుక్కుండా వదిలేసిందని మనసులో పెట్టుకున్న శామ్ కర్రన్ సరిగ్గా పంజాబ్ బే మీదే విజృంభించాడా..హాఫ్ సెంచరీ అయ్యాక శామ్ కర్రన్ చూపించిన కాలింగ్ సెలబ్రేషన్ దేనికి సంకేతమో మరి.. నిన్న శామ్ కర్రన్ ఇన్నింగ్స్ అయితే వైల్డ్ ఫైర్ అసలు .
Category
🗞
News