అసభ్యంగా మాట్లాడారు.. -జబర్దస్త్ శాంతి స్వరూప్

  • 7 years ago
Jabardasth Actor Shanti Swaroop became popular with female characters. In the latest interview, he said many interesting things.

ప్రస్తుతం తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో 'జబర్దస్త్' ఎంత పాపుల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కార్యక్రమంలో లేడీ గెటప్‌లు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శాంతి స్వరూప్. ప్రస్తుతం రన్ అవుతున్న ఎపిసోడ్లలో శాంతి స్వరూప్ లేకుండా దాదాపు ఏ స్కిట్ ఉండటం లేదు. శాంతి స్వరూప్ తాజాగా ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. లేడీ పాత్ర వేయడం ద్వారా ఎందుర్కొంటున్న లాభ నష్టాలను వెల్లడించారు. దాంతో పాటు ఇక్కడి వరకు రావడానికి తాను ఎంత కష్టపడ్డానో వివరించారు.
ఐదుగురు అన్నదమ్ముల్లో నేను నాలుగోవాడిని. ఇంట్లో ఆడపిల్లలు లేకపోవడంతో అమ్మ నన్ను చిన్నతనంలో ఆడపిల్లలా తయారు చేసి మురిసిపోయేది. నా స్కూల్ డేస్ లో జాతరలో ఓ స్టేజ్ షోలో లేడీ గెటప్ వేశాను. అప్పుడే ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక మొదలైంది.... అని శాంతి స్వరూప్ తెలిపారు.
పదో తరగతి ఆపేసిన తర్వాత కావలిలో టెలిఫోన్ బూత్ లో పని చేసేవాడిని. ఇంట్లో చెబితే ఒప్పుకోక పోవడంతో సీరియల్‌లో నటించే అవకాశం వచ్చిందని అబద్ధం చెప్పి హైదరాబాద్ వచ్చేశా... అని తెలిపారు.
ఎలాగైనా ఇండస్ట్రీలోనే సెటిలవ్వాలని డిసైడ్ అయ్యాను. ఓ సినిమా ఆఫీసులో ఆఫీస్ బాయ్ గా చేరడానికి వెళ్లాను. అలా ఆఫీస్ బాయ్ నుండి సినీ ఆర్టిస్టులకు అసిస్టెంటుగా ఉండే స్థాయికి వచ్చాను. రాశి, సత్యరాజ్, పూరీ జగన్నాథ్.. ఇలా చాలా మంది ఆర్టిస్ట్ ల దగ్గర పని చేస్తూ... అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండే వాడిని అని శాంతి స్వరూప్ తెలిపారు.

Recommended