ఇప్పటి వరకు నేను 350 మందితో పడుకున్నా : సంజయ్ దత్

  • 6 years ago
నా జీవితంలో ఇప్పటి వరకు నేను 308 మందితో పడుకొని ఉంటాను. ఇక వేశ్యలతో కలిపితే ఒక 350 మంది ఉంటారని అనుకొంటా అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బోల్డ్‌గా చెప్పడం ప్రేక్షకులకే కాదు.. సినీ తారలకు కూడా దిమ్మతిరిగిపోయి ఉంటుంది. సంజయ్ రొమాంటిక్ జీవితానికి సంబంధించిన విషయాలను సంజూ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఆసక్తికరహైన విషయాలను వెల్లడించారు.
యవ్వనంలో సంజయ్ దత్ అందగాడు. అతడిని చూసి ప్రేమలో పడని యువతి గానీ, హీరోయిన్లు గానీ లేరంటే అతిశయోక్తిగా ఉంటుంది. తనతో అఫైర్ సాగించే ప్రతీ అమ్మాయిని శ్మశానానికి తీసుకెళ్లేవాడు. అమ్మాయిల సానుభూతి పొందేందుకు చాలా చిట్కాలు ఉపయోగించేవాడు అని రాజ్ కుమార్ హిరాణి తెలిపారు.
తనతోపాటు శ్మశానికి వచ్చిన అమ్మాయిలతో.. నిన్ను మా అమ్మ సమాధి వద్దకు తీసుకొచ్చాను. మా అమ్మ ఈ లోకం లేదు. ఆమెను పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అని సంజూ అనేవాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలు ఎమోషనల్ అయిపోయి సంజుతో అఫైర్‌లో మునిగిపోవడం వారి వంతు అయ్యేది అని హిరానీ పేర్కొన్నారు.అయితే తన తల్లి సమాధి వద్దకు కాకుండా వేరే ఎవరో సమాధి వద్దకు తీసుకెళ్లి అమ్మాయిలతో సంజయ్ దత్ అబద్ధం అడేవాడు అని హిరానీ వెల్లడించేవాడు. ఎవరైన అమ్మాయి తనను మోసగిస్తే దారుణంగా ప్రవర్తించేవాడు అని సంజయ్ మరో కోణాన్ని బయటపెట్టాడు హిరానీ.

Recommended