కోట్ల వసూళ్లు, భారీ లాభాలు ఉత్తిదేనా?

  • 7 years ago
Actor S Ve Shekher, who is also propaganda secretary of the BJP, recently claimed that Mersal suffered a loss of Rs 60 crore. In an interview to a leading website, Shekher cites the "illogical costs" borne by the producers as one of the reasons for the loss.

తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' మూవీ విడుదలైన తర్వాత వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల్లోనూ సినిమా భారీ విజయం సాధించిందని, రూ. 250 కోట్ల వసూళ్లు సాధించింది నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇదే చిత్రం తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో లాభాలు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, నష్టాలు వచ్చాయంటూ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బీజేపీ నేత, నటుడు ఎస్ వి శేఖర్ ఈ చిత్రం విషయంలో సంచలన కామెంట్స్ చేశారు.
‘మెర్సల్' సినిమా విషయంలో నిర్మాతలు చూపుతున్న లెక్కలు తప్పడు లెక్కలే అని, ఈ చిత్రానికి రూ. 60 కోట్ల నష్టం వచ్చిందని, సినిమాకు పెట్టిన కొన్ని అనవసరమైన ఖర్చులే ఇందుకు కారణమని తెలిపారు.

Recommended