• 6 years ago
Sri Reddy Mallidi is news presenter and actor in Television Industry. Later, She became actress. But Sri Reddy not achieved much glare from the producers. In this situation, She spoke to a youtube Channel and blasted about casting couch.

వర్ధమాన తార శ్రీరెడ్డి మంచి యాంకర్ మాత్రమే కాదు.. ప్రతిభావంతురాలైన నటి. టెలివిజన్ రంగంలో రాణిస్తుండగానే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. శ్రీరెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఆఫర్లు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరెడ్డి వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే...
క్యాస్టింగ్ కౌచ్ (వేషాల కోసం పడకగదిలోకి) అంటే చాలా పెద్ద పదం. చాలా పెద్ద విషయం. ఒక అమ్మాయి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాలి. శారీరాన్ని కాపాడుకోవాలి. అందుకోసం జిమ్‌కు వెళ్లి ఎక్స్‌ర్‌సైజులు చేయాలి. అందంగా ఉండటానికి కడుపు మాడ్చుకోవాలి అని శ్రీరెడ్డి అన్నారు.
టాలీవుడ్‌లో ఏడాదికి 100 సినిమాలు రిలీజ్ అయితే మూడు, లేదా నాలుగు సినిమాలు హిట్టవుతున్నాయి. ఫెయిల్యూర్స్ కారణమేమిటంటే ముఖ్యంగా తెలుగు నేటివిటి ఉండకపోవడమే. ముంబై నుంచి హీరోయిన్లను తీసుకోస్తారు. వాళ్లకు డైలాగ్ చెబితే లిప్ సింక్ కాదు.
నాన్నలు, తాతల పేర్లు తగిలించుకొనే హీరోలు, నాని లాంటి వాళ్లకు కన్నడ, తమిళ, మలయాళ, ముంబై హీరోయిన్లు అయితేనే ఇష్టం. తెలుగు అమ్మాయిలంటే ఎందుకు దూరం పెడుతారు. మేము ఎక్స్‌పోజింగ్ చేయలేమా? డైలాగ్ చెప్పలేమా? ఎందుకు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
ఆఫర్ ఇచ్చే ముందు తమిళంలో కాంప్రమైజ్ అవుతారా? తెలుగులో కమిట్‌మెంట్ ఇస్తారా అని అడుగుతారు. ఆ ప్రశ్నలకు మాతో పడుకొంటారా అని అర్థం అని శ్రీరెడ్డి అన్నారు. అలా సిద్ధపడిపోతే చివరకు కేవలం ఓ మామూలు క్యారెక్టర్ దొరకడం మినహా ఏమీ ఉండదు.

Recommended