• 8 years ago
Senior Film Writer Diwakar Madabhushi responded over Pawan Kalyan head shave issue. He shared his conversation with Paritala Ravi on this issue.

పవన్ కళ్యాణ్ తన తాజా ప్రసంగాల్లో 'గుండు' ప్రస్తావన తీసుకురావడం పెద్ద చర్చనే లేవనెత్తింది. అటు మీడియా చానెళ్లలోను, ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద డిబేట్ జరిగింది.
పవన్ అసలు ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించకుండా ఉండాల్సింది అనేవారు కొందరైతే.., ఇప్పటికైనా దానికి ఫుల్ స్టాప్ పెట్టే పనిచేశారని మెచ్చుకుంటున్నవారు మరికొందరు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ 'గుండు' వ్యవహారంపై హాట్ హాట్ చర్చ సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సినీ రచయిత దివాకర్ మాడభూషి సైతం ఈ విషయంపై స్పందించారు. తన అనుభవంలోకి వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అప్పట్లో పరిటాల రవి ఫిలిం నగర్ లోని ఆయన ఇంటికి పిలిపించి.. తనకో పాయింట్ చెప్పారని, దానిపై కథ చేయమన్నారని ఆ పోస్టులో పేర్కొన్నారు.కథ రెడీ అయ్యాక అనంతపురం రమ్మని తనకు కబురుపెట్టారని దివాకర్ మాడభూషి పోస్టులో తెలిపారు. ఆయన చెప్పినట్లే తాము అక్కడికి వెళ్లామని, వెళ్లేసరికి ఆయన ఇంటికి మరమ్మత్తులు చేస్తుండటంతో తమను ఓ గెస్ట్ హౌజ్ కు తీసుకెళ్లారని అన్నారు. అక్కడ పరిటాల రవికి తాను కథ వివరించానని, కానీ అనుకున్న విధంగా రాలేదన్న కారణంతో మళ్లీ వర్క్ చేయమని పరిటాల చెప్పినట్లుగా వివరించారు.

Category

🗞
News

Recommended