• 8 years ago
Popular critic and the man who earned a Reputation as staunch Pawan Kalyan hater, Kathi Mahesh did strike with words at this moment as well.

పవన్ కళ్యాణ్ స్పీచ్ బయటికి వచ్చిందంటే చాలు ఇప్పుడు అందరి కళ్ళూ ఒకరి మీదికే వెళ్తాయి. ఊహించటం కష్టమేమీ కాదు ఆయన కత్తి మహేష్. ఒకరకంగా మహేష్‌కీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కీ మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా కూడా మహేష్ పవన్‌ని వదిలిపెట్టలేదు గడిచిన మూడు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న పవన్ తీరును.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని వరుస పోస్టులతొ ప్రశ్నలు వేశాడు.
విశ్వమానవుడు అంటూ పవన్ ని సంబోదిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన మహేశ్.. కులం దగ్గర మొదలుపెట్టి ప్రధాని నరేంద్ర మోడీతో స్నేహం వరకూ ప్రతీ విషయాన్నీ మళ్ళీ పైకి తీసుకువచ్చాడు. గతంలోకంటే మరింత సూటిగానే ప్రశ్నలు వేశాడు... ఇదిగో.. మహేష్ పెట్టిన పోస్టులు ఇవే !
"ఒక కులానికే నిన్ను ఎవరు పరిమితం చెయ్యడం లేదు PK. కాకపోతే కాపు సామాజిక వర్గం మీ అన్నయ్య చేసిన అన్యాయానికి నీ నుంచీ ప్రతిఫలం ఆశిస్తోంది. నేను విశ్వమానవుడ్ని. నాకు కులం లేదు...లాంటి ఉబుసుపోని కబుర్లు చెప్పకు. కాపు రిజర్వేషన్ల పట్ల నీ వైఖరి నీ సహజ ప్రవృత్తిని తెలియజెప్పేసింది".

Recommended