• 8 years ago
Now, the situation appears to be vandalisation of historic sites. The Revenue Department is allegedly on a pursuit of gold treasure at the 16th century fort at Chennamaplli village in Tuggali mandal. The area falls under Adoni Revenue Division, which is notorious for illegal gold trade and smuggling activities.

కర్నూలు జిల్లాలోని చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేటకు ప్రభుత్వమే తవ్వకాలు జరిపిస్తున్నసంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో జోరుగా తవ్వకాలు సాగిస్తున్న మైనింగ్ సిబ్బందికి సోమవారం ఒక విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో భారీగా గుప్తనిధులు ఉన్నట్లు అక్కడి వాళ్లు బలంగా విశ్వసిస్తారు. ఇటీవలి కాంలో అక్కడ గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిపేవాళ్లు ఎక్కువైపోవడంతో , వీటివల్ల నిత్యం గొడవలు కూడా జరుగుతుండటంతో ఇదంతా దేనికని ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా గత ఐదు రోజులుగా చెన్నంపల్లి కోటలో అధికారులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు కూడా గుర్తించి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. గుత్తి రాజులతో యుద్ధం సమయంలో చెన్నంపల్లి రాజులు తమ నిధిని, చెన్నంపల్లి కోటలోనే భద్రపరిచారని ఈ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ సమయంలో వజ్రాలు, వైఢ్యూర్యాలు, బంగారాన్ని ఈ కోట లోపల దాచి, దానిపై సీసం పోశారని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసిన సమయంలో వజ్రాల కోసం వేట సాగించడం, కొంత మందికి వజ్రాలు దొరికినట్లు వార్తలు రావడం తెలిసిందే. ఇక్కడ అనేకసార్లు అక్రమ తవ్వకాలు కూడా జరిగాయి. ఆయా సందర్భాల్లో పలుసార్లు స్థానికులతో గొడవలు జరిగాయి. ఈ గొడవలంతా ఎందుకని ప్రభుత్వమే ఇక్కడ నిధి విషయం తేల్చేసేందుకు రంగంలోకి దిగింది. సంబంధిత అధికారులతో అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో ప్రభుత్వమే నిధిని వెలికి తీసేందుకు తవ్వకాలు జరిపిస్తోంది. అయితే సోమవారం నిధి ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారంటూ పుకార్లు రావడం సంచలనం సృష్టించింది. దీనికి తోడు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి ఉన్నతాధికారులు రావడం, కోట చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడం వదంతులకు మరింత బలం చేకూర్చింది.

Category

🗞
News

Recommended