• 6 years ago
Agnyaathavaasi movie made nearly Rs. 150 crores pre release business. But this movie failed to impress audience. In that situation, Reports suggest that He is willing to do a movie before elections.

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత ఇక సినిమాలకు గుడ్‌ బై అని పవన్ కల్యాణ్ చెప్పడంతో ఫ్యాన్స్‌కు గుండె పగిలినంత పనైంది. రాజకీయాల్లోనే కొనసాగుతూ ఏడాదికో సినిమా చేస్తే బాగుండని అభిమానులు కోరుకొన్నారు. అయితే ఎన్నికలకు ముందు పవన్ సినిమా చేస్తాడా లేదా అనేది సందేహంగానే మిగిలిపోయింది. తాజాగా పవన్ ఓ సినిమా చేస్తున్నాడనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందే ఓ సినిమాలో నటిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాలు చేసేందుకు సానుకూలంగా ఉన్నారు. మార్చి చివరి వారంలో గానీ, ఎప్రిల్‌లో గానీ కొత్త సినిమా పట్టాలెక్కనున్నదట.
జనసేన పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తూనే సినిమాను పూర్తి చేయాలని పవర్ స్టార్ భావిస్తున్నాడట. సినిమా కోసం పరిమితమైన కాల్షీట్లు కేటాయించి రాజకీయ పనుల్లో నిమగ్నమవుతాడట. పరిమితమైన కాల్షీట్లతో పవన్ కల్యాణ్‌తో సినిమా పూర్తి చేసే దర్శకుడి ఎవరు అనేది ఫిలింనగర్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
అజ్ఞాతవాసి చిత్రానికి ముందే ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించే చిత్రంలో నటించేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పవన్ చేతుల మీదుగా ముహుర్తం కార్యక్రమాలు జరిగాయి. అయితే రాజకీయ కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టడంతో అది నిలిచి పోయిందని ప్రచారం జరిగింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఓ చిత్రాన్ని చేసేందుకు పవన్ కల్యాణ్ అడ్వాన్స్ పుచ్చుకొన్నారట. అడ్వాన్స్ వ్యవహారంపై మైత్రీ మూవీస్ అధినేతలు సీరియస్‌గా ఉండటం పవన్‌ను ఇరుకున పెడుతున్నదట. అయితే ఆ సినిమాను చేయకపోతే భారీ మొత్తాన్ని వారికి చెల్లించాల్సి ఉంటుందట.
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయనున్నాడని ఓ టాక్ వినిపిస్తోంది. అయితే ఏఎం రత్నం సినిమాకే పవన్ ఓటేస్తాడని మరో మాట కూడా ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఈ వార్త నిజమైతే అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.

Recommended