• 7 years ago
All set for the arrest of Ram Gopal Varma based on the complaint lodged by Social Activist Devi.

కాంట్రవర్సీ రారాజు రాంగోపాల్ వర్మ అరెస్ట్ కు అంతా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే చిత్రం ద్వారా వర్మ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఏకంగా పోర్న్ స్టార్ మియా మాల్కోవా ని రంగంలోకి దించి మరి దాదాపు పోర్న్ సినిమాకు సమానమైన వెబ్ సిరీస్ ని తీశాడు. వర్మ చర్యలు శృతిమించుతున్నాయని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు పెద్దఎత్తున మీడియాలో, బయట నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ టివి చర్చ కార్యక్రమంలో వర్మ ప్రజా కార్యకర్త దేవితో అనుచితంగా ప్రవర్తించారు. వర్మపై ఆమె కేసు నమోదు చేశారు. వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రం ద్వారా వర్మ స్త్రీ లైంగిక స్వేచ్చని వ్యక్త పరచాలని భావించారు. ఇందుకోసం పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఈ చిత్రాన్ని చేశారాయన.
వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రానికి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మీడియాలో చర్చ జరిగాయి. వర్మ ఎప్పటి లాగే తన చిత్రాన్ని సమర్ధించుకున్నారు. అయితే చిత్రాన్ని ప్రజా కార్యకర్త దేవి త్రీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో వెరీ మధ్య వాగ్వాదం జరిగి వర్మ అనుచిత వ్యాఖ్యలు చేసేవరకు వ్యవహారం వెళ్ళింది.
ప్రజా కార్యకర్త దేవిని ఉద్దేశించిన వర్మ అనుచిత వ్యాఖ్యలు చేసారు, ఆమెతో కూడా పోర్న్ చిత్రం చేస్తా అంటూ అసభ్యంగా మీడియా చర్చలో మాట్లాడారు. దేవి చెత్తగా ఆలోచిస్తారని వర్మ కామెంట్ చేసారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలవారికి తానే ప్రతినిధి అన్నట్లుగా మాట్లాడతారని వర్మ వ్యాఖ్యానించారు.

Recommended