• 6 years ago
1.వివాహేతర సంబంధాలు: ‘పురుషులే నేరస్తులు! సెక్షన్ 497 కొనసాగించాల్సిందే’
వివాహేతర సంబంధాల్లో పురుషుడితో సమానంగా స్త్రీని కూడా శిక్షించాలన్న వాదనను కేంద్రం వ్యతిరేకించింది. ఇలాంటి వ్యవహారాల్లో పురుషుడిని ఖైదు చేసే భారతీయ శిక్షా స్మృతి.. సెక్షన్‌ 497ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పురుషుడిని మాత్రమే దోషిగా గుర్తిస్తున్న ఈ సెక్షన్‌ను తొలగించాలని కేరళకు చెందిన జోసెఫ్‌ షైన్‌ గత సంవత్సరం డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సెక్షన్‌ 497ను తొలగిస్తే దేశంలో కల్లోలం జరుగుతుందని అభిప్రాయపడింది. వివాహం అనే పవిత్ర బంధానికి అర్థం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
1.అంచనాలు భారీగా పెంచారు: నితిన్ గడ్కరీ, చంద్రబాబు వివరణ, పోలవరం సందర్శన వివరాలు
డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోపాటు ఆయన పోలవరం సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్రమంత్రికి చంద్రబాబు వివరించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనులన్నీ పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏప్రిల్ కల్లా అన్ని మెజార్టీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 2019, డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. డీపీఆర్2ను కూడా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరామని చెప్పారు.
అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పోలవరం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు దేశానికే కీలక ప్రాజెక్టు అని అన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. మరింత వేగం పెంచాలని కోరారు.

Union water resources minister Nitin Gadkari visited the Polavaram project site on Wednesday and said the Centre was fully committed to completing the project in time.

Category

🗞
News

Recommended