పెళ్లై ఐదేళ్ళే.. 20 మంది పిల్లలా ?

  • 7 years ago
Vidya, who is close to turning 39, revealed how she is preparing for her birthday on January 1. “Since I’m turning 39, I’ve been telling my friends that I want to do something crazy.


ఒక నిండు గర్భిణీ పాత్రలో కోల్‌కతా ఇరుకు సందుల్లో పరిగెడుతూ 'కహానీ' సినిమాలో విద్యా బాలన్ కనబరిచిన నటనను అంత ఈజీగా మరిచిపోగలమా!.., అంత ట్రెడిషనల్‌గా కనిపించిన విద్యా.. డర్టీ పిక్చర్లో అంతే బోల్డ్ నెస్‌తో రెచ్చిపోవడం మరవగలమా!.. కెరీర్ పరంగా తొలి నుంచి విద్యా బాలన్ మిగతా హీరోయిన్ల కన్నా భిన్నమనే చెప్పాలి. వైవిధ్యభరితమైన కథాంశాల్లో నటించడానికే ఆమె మొగ్గుచూపుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా బేగం జాన్, తుమ్హారీ సులు వంటి విభిన్న కథాంశాలతో ఆమె ప్రేక్షకులకు ముందుకు వచ్చారు.
జనవరి 1న విద్యా 39వ వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. తన సినిమాల గురించి వ్యక్తిగత విషయాల గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు.
'39వ వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకోసం నా స్నేహితులు, నా భర్త కూడా ఏవో ఏర్పాట్లుచేస్తున్నారు..' అని విద్యా చెప్పారు.
విద్యా బాలన్ ప్రెగ్నెంట్ అని ఆమధ్య పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై ఐదేళ్లయినా పిల్లలు లేకపోవడంపై విద్యా తాజాగా స్పందించారు. 'నా సినిమాలే నా పిల్లలు. అంటే నా జీవితంలో 20 మంది పిల్లలున్నారు' అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తన ధ్యాసంతా కేవలం సినిమాలపైనే ఉందన్నారు విద్యా బాలన్. కెరీర్ పరంగా మరిన్ని మంచి చిత్రాలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Recommended