• 7 years ago
Renu Desai said..... I really thought that finally I will be able to use my Instagram in peace but life is full of irony’s.
పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందులో రేణు దేశాయ్ జనసేన అధినేత మీద దారుణమైన ఆరోపణలు చేసినట్లు ఉంది. ఈ ఫేక్ న్యూస్ మీద వెంటనే రెస్పాండ్ అవ్వాలని, లేనిచో మా దేవుడికి చెడ్డ పేరు వస్తుందంటూ..... కొందరు పవన్ అభిమానులు రేణుపై ఒత్తిడి తేవడంతో ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నాకు వేధింపులు ఎదురైనపుడు మీరంతా ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వలేదు? ఆయనకో రూల్, నాకో రూలా? అంటూ ఫైర్ అయ్యారు.
నా జోలికి వస్తే మీ హీరో గుట్టు విప్పుతా. 2009 ఎన్నికల కోసమే నాకు తాళి కట్టాడు. 2014 ఎన్నికల్లో గొడవ కాకూడదనే ఇపపుడున్న ఆవిడకు తాళి కట్టాడు. మేమిద్దరం పెళ్లికి ముందే తల్లులమయ్యాం. ఇన్నాళ్లు పవన్ పరువుపోతుందని పెద్దవాళ్లు బ్రతిమిలాడితే ఊరుకున్నాను. ఇపుడు నా జీవితం నేను బ్రతకుతున్నా అతడి అభిమానులు వేధింపులు ఆపడం లేదు. పవన్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. నా కళ్ల ముందే వేరే అమ్మాయిలతో పవన్ పడుకున్నాడు. ఇపుడున్న అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే కోర్టుకు ఈడుస్తానని భయ పెట్టింది. తాళి కట్టకుండా వదిలేసిన జాబితా చాలా పెద్దది.... అంటూ రేణు దేశాయ్ చెప్పినట్లు ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘నా జీవితం ప్రశాంతంగా సాగాలనే ఉద్దేశ్యంతో కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ మాత్రమే వాడాలని అనుకున్నాను. కానీ అక్కడ కూడా కొందరు నాకు ప్రశాంత లేకుండా చేస్తున్నారు... అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న సందేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Recommended