• 7 years ago
Now the director RGV is making a movie like documentary 'GST'. Recently two photos of this movie are leaked in social media and gone viral.

వివాదాలే వర్మ సినిమాలకు మార్కెటింగ్ స్ట్రాటజీ. తద్వారా వచ్చే పబ్లిసిటీ.. దాని మీద జరిగే రచ్చ.. టీవి చానెళ్ల డిబేట్స్.. మొత్తంగా ఆయన కంటెంట్ ఎంతమందికి చేరాలో అంతమందికీ చేరుతుంది. సమాజం.. సంస్కారం లాంటి మాటలతో వర్మను అడ్డుకోవడం ఇప్పటిదాకా ఓ విఫలయత్నంగానే మిగిలిపోయింది. 'గాడ్ సెక్స్&ట్రూత్' విషయంలోనూ అది విఫలయత్నమేనేమో!. ఇదంతా పక్కనపెడితే.. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు లీకవడం గమనార్హం.
జీఎస్‌టీ( గాడ్ సెక్స్&ట్రూత్ )కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాకు లీకవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. షూటింగ్ సందర్భంగా వర్మ సీన్స్ ను మానిటర్ చేస్తున్న సమయంలో.. ఆయన పక్కనే మియా మాల్కోవా న్యూడ్ గా నిలుచున్న ఫోటో తెగ వైరల్ అవుతోంది.
జీఎస్‌టీ పోస్టర్ లీక్ అయిందా?.. లేక స్ట్రాటజీ ప్రకారం వర్మనే లీక్ చేశాడా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. వివాదాలతో పబ్లిసిటీని కోరుకునే వర్మ.. ఈ పోస్టర్ తో మరింత పబ్లిసిటీ వస్తుందని భావించే.. దీన్ని సోషల్ మీడియాలో వదిలారనేది కొంతమంది వాదన.
లీకైన ఫోటోను చూస్తుంటే.. అది దొంగచాటుగా తీసినట్లు కనిపించడం లేదు. షూటింగ్ టైమ్ లో అఫీషియల్ గా తీసిన ఫోటోల లాగే కనిపిస్తోంది. కాబట్టి వర్మ ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోను సోషల్ మీడియాలో లీక్ చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended