Sketch is an Tamil romantic action movie directed by Vijay Chander. The movie has Tamannaah and Chiyaan Vikram in lead roles.
వైవిధ్యమైన చిత్రాలతో చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. విలక్షణమైన నటుడిగా విక్రమ్ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. ఓ వైవిధ్యమైన పాయింట్‌తోపాటు, అందాలతార తమన్నా భాటియాతో జతకట్టి విక్రమ్ తాజాగా స్కెచ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 23న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరక ఆకట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
స్కెచ్ (విక్రమ్) లోన్ వాయిదాలు కట్టకపోతే వాహనాలను ఎత్తుకొచ్చే రికవరీ ఏజెంట్. సేట్ అనే వ్యాపారి (హరీష్ పెరాడీ) వద్ద పనిచేస్తుంటాడు. ముగ్గురు మిత్రులతో కలిసి వ్యవహారాలు నిర్వహిస్తుంటాడు వాహనాలు ఎత్తుకొచ్చే క్రమంలో అమ్ము (తమన్నా)తో ప్రేమలో పడుతాడు. కథ ఇలా సాగుతుండగా, కుమార్ అనే మాఫియా గ్యాంగ్ లీడర్ కారు ఎత్తుకు రావడం వల్ల స్కెచ్‌కు సమస్యలు ప్రారంభమవుతాయి.
ప్రత్యర్థి వర్గం నుంచి తనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదురించాడు? ప్రేమించిన తమన్నాను పెళ్లి చేసుకొన్నాడా? తనతో కలిసి పనిచేసే మరో ముగ్గురు స్నేహితులను ఏ పరిస్థితుల్లో కోల్పోయాడు? తన స్నేహితులను ఎవరు మట్టుపెట్టారు? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే స్కెచ్ సినిమా కథ.
ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ పాయింటే స్కెచ్ చిత్ర కథ. హృదయానికి హత్తుకొకనే ఓ మంచి సందేశం కథలో ఉంది. వెహికిల్స్ సీజ్ చేసే వ్యక్తుల జీవితంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి. వారి మధ్య గ్రూపు తగదాలు, వివాదాలు ఎలా ఉంటాయనే అంశాలతో తొలి భాగం సాగుతుంది. తొలిభాగంలో పెద్ద కథ లేకపోవడం, కథనం నెమ్మదించడం, రొటీన్‌గా కథ సాగడం ప్రేక్షకుడిని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. కానీ ఓ మంచి ఛేజింగ్ సీన్‌తో ఆసక్తి రేకెత్తించడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
ఇక రెండో భాగంలో అసలు కథ మొదలవుతుంది. కుటుంబం, ప్రేమ, స్నేహితుల మధ్య నడిచే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ సన్నివేశాలు వరకు థ్రిల్లింగ్ ఉంటాయి. విక్రమ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా రొటీన్‌కు భిన్నంగా సినిమాను ముగించడం స్కెచ్‌కు ప్రధాన ఆకర్షణ. సినిమా ముగింపే ప్రేక్షకుడికి ఆకట్టుకునే అంశంగా మారడం స్కెచ్‌కు బలం అని చెప్పవచ్చు. అయితే తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటుల ఎక్కువ మంది ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు.

Category
🎥
Short film