• 7 years ago

విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను ఒప్పించిన గోపిచంద్‌కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. సక్సెస్ బాట పట్టిస్తుందనుకొన్న గౌతమ్ నంద కొంత నిరాశే మిగిల్చింది. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం కొత్త డైరెక్టర్ కే చక్రవర్తితో కలిసి పంతం చిత్రంతో ముందుకొచ్చారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో గోపిచంద్‌కు జతకట్టారు. జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పంతం చిత్రం ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
లండన్‌లో మల్టీ మిలియనీర్ కుమారుడైన విక్రమ్ సురానా (గోపిచంద్) ఓ పని కోసం ఇండియాకు వస్తాడు. ఊహించని పరిస్థితుల కారణంగా ఓ కార్యాన్ని భుజానకెత్తుకొని కామన్ మ్యాన్‌గా మారుతాడు. ఇండియాలో రకరకాల దోపిడి, అక్రమాలను చూసి చలించిపోతాడు. అందుకు కారణమైన హోంమంత్రి జయేంద్ర అలియాస్ నాయక్ భాయ్, ఆరోగ్యశాఖ మంత్రి (జయప్రకాశ్ రెడ్డి) దాచుకొన్న నల్లధనాన్ని దోచి అనాథ శరణాలయకు, కొంత మంది బాధితులకు పంచిపెడుతుంటాడు. తమ వద్ద నుంచి డబ్బు కొట్టేసేదెవరు అని తెలుసుకోవడానికి మంత్రులు తలపట్టుకొంటారు. ఈ క్రమంలో చివరికి నల్లధనాన్ని దోచుకొనేది విక్రమ్ అని తెలుస్తుంది.
సంపన్నుడైన విక్రమ్ నల్లధనాన్ని దోచుకోవడానికి దారితీసిన కారణమేమిటి? తన లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో తారస పడిన అక్షర (మెహ్రీన్) ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు? విక్రమ్ ఎత్తులకు మంత్రులు ఎలాంటి పై ఎత్తులు వేశారు. తాను అనుకొన్న లక్ష్యాన్ని విక్రమ్ ఎలా చేరుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే పంతం సినిమా కథ.
సంపన్నులను, అక్రమార్కులను దోచుకొని పేదవాళ్లకు పెట్టడమనే సింగిల్ లైన్ పాయింట్‌తో పంతం చిత్రం తెరకెక్కింది. వాడకం వాలేశ్వరరావు (పృథ్వీ) ఇంట చేరడం, కామెడీ ట్రాక్‌ ఉపయోగించుకొంటూ అసలు కథను తీసుకెళ్లే ప్రయత్నం తొలిభాగంలో జరిగింది. తాను అనుకొన్న బలమైన పాయింట్‌ను చెప్పడానికి దర్శకుడు చక్రవర్తి కాస్త సమయాన్ని ఎక్కువగానే హరించాడనే ఫీలింగ్ ఫస్టాఫ్‌లో కలుగుతుంది. తొలిభాగంలో వినోదాన్ని పంచడానికి ఫిక్స్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

‘Pantham’-with the tagline ‘For a Cause’ with Gopi Chand and Mehreen Kaur Pirzada as the lead pair, produced by KK Radha Mohan under the Sri Satya Sai banner and helmed by K Chakravarthi, is all set to release on July 5.

Recommended