Chalo Movie Actress Rashmika Mandanna Interview. Chalo the film is a 2018 Telugu romantic comedy written and directed by Telugu Film Director Venky Kudumula marking his debut as a director.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఛలో'. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా కన్నడ హీరోయిన్ రష్మిక తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రష్మిక మంగళవారం మీడియాతో ముచ్చటించారు.
నేను కర్నాటకలో ‘కూర్గ్' నుండి వచ్చాను. కూర్గ్ లో నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత మైసూర్, బెంగుళూరులో చదువుకున్నాను. బెంగులూరులో డిగ్రీ చదువుతున్న సమయంలో కన్నడమూవీ ‘కిరిక్ పార్టీ'లోఆఫర్ వచ్చింది. అదే నా తొలి సినిమా. ఆ తర్వాత ‘అంజనీపుత్ర' తదితర చిత్రాల్లో నటించా. ఈ సినిమాలు చూసి నాకు ‘ఛలో'లో అవకాశం ఇచ్చారు అని రష్మిక తెలిపారు.
నా తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ'లో నేను కాలేజీ అమ్మాయిగా చేశారు, ‘ఛలో'లో కూడా కాలేజీ అమ్మాయిగానే చేస్తున్నాను. కానీ రెండు పాత్రల్లో చాలా తేడా ఉంది. సినిమా కథ, నా క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది... తెలుగు, తమిళ సరిహద్దు దాటి వచ్చిన ఓ కుర్రాడితో ప్రేమలో పడే పాత్ర చేశాను అని రష్మిక తెలిపారు.
నాగశౌర్య నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు. సినిమా నిర్మించేది వాళ్ల ఫ్యామిలీ కాబట్టి ఇదో షూటింగులా కాకుండా పిక్‌నిక్ లాగా సాగింది. తెలుగులో నా తొలి సినిమా ఇది.. మాతృభాషలో నటిస్తున్న ఫీలింగ్ కలిగింది అని రష్మిక తెలిపారు.
‘ఛలో' పాటలు చాలా బాగా వచ్చాయి. ‘చూసి చూడంగానే..' పాట చిత్రీకరణ సమయంలోనే ఇది పెద్ద హిట్ అవుతుందని చెప్పా. ఆ పాట ఇపుడు అందరికీ నచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ స్వరసాగర్ మహతి మంచి మ్యూజిక్ ఇచ్చాడు అని రష్మిక తెలిపారు.

Category
🎥
Short film