Ranbir Kapoor Starts New Affair With Pakistani Model

  • 6 years ago
Ranbir Kapoor and Mahira Khan secretly meet in London. Ranbir Kapoor in relation with Mahira.

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్ తన సినిమాల కంటే కూడా హీరోయిన్లతో ఎఫైర్ల వలన ఎక్కువగా వార్తలో నిలిచాడు.గతంలో రణబీర్ సాగించిన ప్రేమాయణాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
రణబీర్ కపూర్ గతంలో బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ తో ఘాటు ప్రేమాయణం సాగించాడు. కత్రినా కైఫ్ తో అయితే క్లోజ్ గా ఉన్న ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీకై హల్ చల్ చేశాయి. కాగా రణబీర్ ఇద్దరితో బ్రేక్ అప్ చేసుకున్నాడు.
కత్రినా కైఫ్ తో బ్రేక్ అప్ అయ్యాక రణబీర్ కపూర్ సింగిల్ గా ఉన్నాడు. కానీ గత ఏడాది నుంచి మరో ఎఫైర్ మొదలు పెట్టాడని వార్తలు వస్తున్నాయి.
రణబీర్ కపూర్, పాకిస్తానీ అందం మహీరా ఖాన్ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. గత ఏడాది వీరిద్దరూ సిగరెట్ కొడుతూ కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. అప్పట్లో సోషల్ మీడియాలో మహీరా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది.
మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం రణబీర్ లండన్ లో ఉన్నాడు. మహీరా కూడా లండన్ లోనే ఉంటోంది. రణబీర్ మరియు మహీరా రహస్యంగా కలుసుకుని ఒంటరిగా గడిపినట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో ప్రేమ వార్తలపై మీడియా మహీరాని ప్రశ్నించింది. రణబీర్ విషయాన్ని దాటవేసిన మహీరా తాను ఎవ్వరితోనూ ప్రేమలో లేనని తెలిపింది. ఇదిలా ఉండగా రణబీర్ కపూర్ త్వరలో నిర్ణయించిన వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా రణబీర్ కపూర్ ప్రేమ వ్యవహారాల గురించి వార్తలు మాత్రం ఆగడం లేదు

Recommended