వీడియో: మహానటి చిత్రంలో డిలీటెడ్ సీన్

  • 6 years ago
Mahanati Movie Deleted Scene. Keerthy suresh rock Savitri steps
మహానటి చిత్ర వేడి ఇంకా చల్లారడంలేదు. ఈ చిత్ర జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో విడుదల తరువాత కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, మధురవాణిగా సమంత, ఫోటో గ్రాఫర్ గా విజయ్ దేవరకొండ మంచి నటన కనబరిచారు. తాజగా చిత్ర యూనిట్ సినిమాలో పొందుపరచని వీడియోని విడుదల చేసింది.
సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సావిత్రిలా హావభావాలు పలికించడం కష్టంతో కూడుకున్న పని. కానీ కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది.
సావిత్రి జీవితం గురించి అనేక అపోహలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా వారంతా సావిత్రి జీవితాన్ని మరో మారు చూడగలిగారు. అత్యంత క్లిష్టమైన అంశాన్ని దర్శకుడు నాగ అశ్విన్ చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజగా మహానటి చిత్ర యూనిట్ ఓ వీడియోని విడుదల చేసింది. చిత్రంలో పొందుపరచని సన్నివేశాని విడుదల చేసింది. అందులో కీర్తి సురేష్ అచ్చు సావిత్రిలా హావభావాలు పలికించడం, డాన్స్ చేయడం చూస్తే ఫిదా కావలసిందే.

Recommended