• 7 years ago
'లస్ట్ స్టోరీస్' మూవీలో నటించిన కియారా అద్వానీ స్వయంతృప్తి సీన్లతో హాట్ టాపిక్ అయింది. ఇలాంటి సీన్లలో నటించడంపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై కియారా స్పందిస్తూ వీటిని ప్రజలు అంగీకరించడానికి కొంత సమయం పడుతుందని అభిప్రాయ పడ్డారు. స్వయంతృప్తి అనేది సాధారణమైన విషయమే అయినా మన సమాజంలో బయటకు చెప్పుకోవడానికి, వాటిని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు అని కియారా అన్నారు.
ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సీన్లు చేయడాన్ని బూతద్దంలో పెట్టి చూసేవారు. కానీ ఇపుడు ఇలాంటి సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. ప్రేక్షకులు కూడా వాటిని అంగీకరిస్తున్నారు. అదే విధంగా స్వయంతృప్తి సీన్లను అంగీకరించడానికి సమయ పడుతుంది అని కియారా అద్వానీ అన్నారు.
ఒకప్పుడు పెళ్లికి ముందు సెక్స్ తప్పు అనే అభిప్రాయం నాలో ఉండేది. అయితే ఇపుడు నా అభిప్రాయం మారింది. సెక్స్ అనేది ప్రేమను వ్యక్తపరిచే ప్రక్రియ. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం అనేది వ్యక్తిగతం, ఇందులో తప్పొప్పులు వెతకాల్సిన పనిలేదని కియారా తేల్చి చెప్పారు.
‘లస్ట్ స్టోరీస్' మూవీలో స్వయం తృప్తి సీన్ చేసేపుడు ఎలాంటి ఇబ్బంది పడలేదు. మేము మా జాబ్ చేస్తున్నామని మాకు తెలుసు. దర్శకుడు కరణ్ జోహార్ ఆ సీన్ ఫన్నీగా కాకుండా రియలిస్టిక్‌గా చేయాలని సూచించారు. సెన్సేషన్ కోసం ఇలాంటివి చేయలేదు. స్క్రిప్టు ప్రకారం అది కీలకం కాబట్టే ఆ సీన్ చేయడం జరిగింది అని కియారా తెలిపారు.

Recommended