Skip to playerSkip to main contentSkip to footer
  • 6/7/2018
SuperStar Rajiniknath's Kaala movie premier show talk. Rajinikanth back with mass elements

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది. రజని సినిమా అంటే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో అందరికి తెలిసిందే. తమిళనాడు సహా ఇండియాలోని రజని ఫ్యాన్స్ అంతా కాలా ఫీవర్ తో ఊగిపోతున్నారు. కబాలి ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలోని రజనీ నటించిన మరో చిత్రం ఇది. రజని అల్లుడు ధనుష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
దర్శకుడు రంజిత్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ కు సూటయ్యే కథతోనే వచ్చాడు. ముంబై లోని ధారవి స్లమ్ ఏరియాలో పేద ప్రజల నాయకుడిగా రజినీకాంత్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు.
రజనీకాంత్ మాస్ లుక్ ఈ చిత్రంలో ఆకట్టుకుంటోంది. దర్శకుడు పా రంజిత్ రజనీకాంత్ ఫ్యాన్స్ కు అవసరమైన మాస్ మసాలా అంశాలు అన్ని ఈ చిత్రంలో దట్టించాడు. వాటిని అద్భుతంగా వెండి తెరపై ప్రజెంట్ చేయడంతో విజయం సాధించాడు అని చెప్పొచ్చు.
రజనీకాంత్ ఇంట్రడక్షన్ సన్నివేశం చాలా బావుంది. ముంబైలోని స్లమ్ ప్రజల కష్టాలని దర్శకుడు నేచురల్ గా చూపించాడు.
ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్లైఓవర్ ఫైట్ సీన్ కాలా చిత్రానికే హైలైట్ అని చెప్పొచ్చు. మాస్ ప్రియులని, రజని అభిమానులని ఈ ఫైట్ విపరీతంగా అలరిస్తుంది. వర్షంలో సాగె ఈ ఫైట్ చూసి ఫాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు.

Recommended