• 6 years ago
After the humongous response to Prabhas' Baahubali franchise in the North, his upcoming film Saaho remains highly anticipated.

బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారీ విజయం సాధించడంతో ప్రభాస్‌కు బాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతడు నటిస్తున్న తాజా చిత్రం 'సాహో' చిత్రానికి ఫుల్ డిమాండ్ ఉండటంతో బాలీవుడ్ బడా సినీ నిర్మాణ సంస్థ టి సిరీస్ ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది.
ప్రభాస్, యూవి క్రియేషన్స్ వారితో టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ‘సాహో' మూవీ కోసం అసోసియేట్ అవుతున్నారని, హిందీలో సాహో చిత్రాన్ని టీ సిరీస్ భారీగా విడుదల చేయబోతోంది అంటూ ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
‘సాహో' మూవీ 2019లోనే విడుదలవుతుందని ఈ సందర్భంగా తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. సాహో మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పలు కారణాలతో ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదలను వచ్చే ఏడాది వాయిదా వేయక తప్పలేదు.
తొలుత 150 కోట్ల బడ్జెట్ ఎస్టిమేషన్‌తో సాహో చిత్రాన్ని ప్రారంభించినా షూటింగ్ ఆలస్యం కావడం, ముందుగా అనుకున్న లొకేషన్లు కాకుండా కొన్ని మార్పులు జరుగడంతో సినిమా పూర్తయ్యే వరకు రూ. 200 కోట్ల బడ్జెట్ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
సాహోలో సుమారు 20 నిమిషాల పాటు ఒళ్లు గగుర్బొడిచే సీక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆ స్టంట్ సీక్వెన్స్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. బైక్‌లు, కార్లు, ట్రక్కులతో ఆ ఛేజింగ్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం.

Recommended