• 7 years ago
దళపతి విజయ్ సర్కార్ సినిమా పోస్టర్ వివాదం తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్నది. ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. పోగాకు వినియోగ వ్యతిరేక సంఘం కార్యకర్త, న్యాయవాది సిరిల్ అలెగ్జాండర్ దాఖలు చేసిన పిల్‌ పరిగణనలోకి తీసుకొని హీరో విజయ్, దర్శకుడు ఏఆర్ మురగదాస్, సన్ పిక్చర్స్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై త్వరలోనే కోర్టు తీర్పు వెల్లడించనున్నది.
దళపతి విజయ్ బర్త్ డే సందర్బంగా సర్కార్ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి, పీఎంకే నేత అంబుమణి రాందాస్ పొగాకు వాడకాన్ని ప్రోత్సహించే విధంగా ఉందంటూ పోస్టర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో ఈ వివాదం మొదలైంది.
హీరో విజయ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి అంబుమణి రాందాస్ ట్విట్టర్లో సెటైర్లు విసిరారు. తన తదుపరి చిత్రంలో విజయ్ పొగాకు వాడకాన్ని ప్రమోట్ చేసే విధంగా పోస్టర్‌ను రూపొందించడం సిగ్గుచేటు. నీ నోట్లో సిగరెట్ లేకుండానే నీవు చాలా స్టైలిష్‌గా ఉంటావు అని అంబుమణి ట్వీట్ చేశారు.

The controversy around Thalapathy Vijay’s Sarkar poster continues to grab the limelight for all the wrong reasons. Madras High court has now issued a notice against Thalapathy Vijay, director AR Murugadoss and production house Sun Pictures for releasing the poster of Vijay
#ARMurugadoss
#ThalapathyVijay

Recommended