• 6 years ago
Inkem Inkem Inkem Kaavaale Lyrical Song From Telugu Movie Geetha Govindam released today. Starring Vijay Devarakonda Rashmika Mandanna. Music Composed by Gopi Sundar, Produced by Bunny Vas and Directed by Parasuram, Under the banner of GA2 Pictures.
#GeethaGovindam

అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న చిత్రం గీత‌గొవిందం. ఈ చిత్రానికి సంబందించి మెద‌టి సింగిల్ ని ఇప్పుడు తాజాగా "ఇంకేం ఇంకేం కావాలి" అనే మెలోడియస్ ని విడుదల చేసింది చిత్ర బృందం. గోపి సుందర్ అద్భుతమైన మెలోడియస్ సాంగ్స్ అందించారు. సిడ్ శ్రీరామ్ ఈ అద్భుతమైన పాటను ఆలపించారు.
అనంత శ్రీరామ్ అందమైన పదాలతో ఈ పాటను రచించారు. ఈ చిత్రం లో ఛలో హీరోయిన్ ర‌ష్మిక మందాన్న గీత పాత్ర‌లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో... శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

Recommended