• 7 years ago
తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ కాలేజీలో కాలేజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎవరో తీశారు. వాటిని బయటకు తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థినులతో పాటు లెక్చరర్ల పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు వీడియోలు, ఫోటోలను పోలీసులకు అందించారు. దీంతో విషయం వెలుగు చూసింది.

Category

🗞
News

Recommended