• 7 years ago
గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో సెక్సువల్ వేధింపులు, కాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మరింత హీటెక్కింది. ఇండస్ట్రీలో మహిళల పట్ల నీచంగా, దారుణంగా వ్యవహరిస్తున్న పలువురు టాప్ డైరెక్టర్లు, టాప్ యాక్టర్ల పేర్లు ఆమె బయట పెట్టడం సంచలనం అయింది.
మహిళలపై సెక్సువల్ హెరాస్మెంట్, లైంగిక దోపిడీ అనేది అన్ని చోట్లా ఉంది. ఇదొక పెద్ద సమస్య. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే ఇది జరుగుతుంది అనే విధంగా మాట్లాడొద్దు. ‘కాస్టింగ్ కౌచ్' పేరుతో ఇండస్ట్రీని టార్గెట్ చేయవద్దు... అని రష్మి ట్వీట్ చేశారు.
జబర్దస్త్, ఇతర టీవీ కార్యక్రమాల్లో యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, ఇతరులు రష్మిపై పంచ్ లు వేస్తున్న సంగతి తెలిసిందే. నీపై అలా పంచ్ లు వేస్తుంటే కోపం రావడం లేదా? అనే ఓ అభిమాని ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ.... ‘కోపం ఎందుకు? మేమంతా కలిసి పని చేస్తున్నా, ఒక ఫ్యామిలీలా ఉంటాం. ఇదంతా తమ జాబ్‌లో భాగమే' అని తెలిపారు.
వేశ్య పాత్రలు చేయడం వల్ల నటీమణుల గౌరవం పోతుందని భావించడం లేదు, వేదంలో అనుష్క చేసి పాత్రకు ఎంతో పేరొచ్చింది. ఆ రోల్స్ చేయడం అంటే అంత సులభం కాదు, ఎంతో చాలెంజ్‌తో చేస్తే తప్ప ఇలాంటి పాత్రలు పండవు అని రష్మి తెలిపారు
తన కెరీర్లో ఇప్పటి వరకు వేశ్య పాత్రలు చేసే అవకాశం రాలేదని, అలాంటి పాత్రలు రావాలన్నా, చేయాలన్న నటన పరంగా ఎంతో ఎస్టాబ్లిష్ అయుండాలి అని రష్మి తెలిపారు.

Recommended