• 7 years ago
Deepika Padukone and Ranveer Singh reception held in town recently. Among the special guests were former Indian cricket captain MS Dhoni and wife Sakshi Dhoni. MS Dhoni was seen posing for the photographers and joking with Sakshi and Pandya.
#MSDhoni
#indvsaus1sttest
#DeepikaPadukone
#HardikPandya
#SakshiDhoni

బాలీవుడ్ నూతన జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె వివాహం జరిగినా ఇంకా సెలబ్రేటింగ్ మూడ్‌లోంచి బయటికి రాలేదు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితుల కోసం నిర్వహించిన ఈ మూడో రిసెప్షన్‌లో టీమిండియా క్రికెటర్లు ఎం.ఎస్.ధోనీ, హార్దిక్ పాండ్య కూడా పాల్గొన్నారు. ధోనీ వెంట ఆయన సతీమణి సాక్షి కూడా కార్యక్రమానికి విచ్చేశారు. అయితే, రిసెప్షన్‌కు వెళ్లడానికి ముందు బయట ఫొటోగ్రాఫ్స్ కోసం ఫోజులిచ్చేటప్పుడు ఓ సరదా సన్నివేశం కనిపించింది. ఫొటోలకు పోజిలివ్వడానికి హార్దిక్‌ పాండ్యాతో వెళ్లమంటూ సాక్షి ధోనీకి సైగ చేశారు. ‘నువ్వు కూడా రా'అని సాక్షిని ధోనీ పిలిచారు. దీంతో ముగ్గురూ కలిసి ఫొటోలకు పోజిలిచ్చారు.

Category

🥇
Sports

Recommended