• 6 years ago
Inspiration from Bigg Boss in other languages, the Tamil version of the show is rumoured to have roped in a prominent name from the LGBTQ community. It is believed that the decision to rope in the person was taken based on Kamal Haasan's advice.
#kamalhaasan
#biggbosstamil
#biggbosstamil3
#biggboss3
#radharavi
#priyaanand
#kollywood
#biggbosstelugu3

హిందీలో మొదలైన బిగ్ బాస్ రియాల్టీ షోకు మంచి పాపులారిటీ రావడంతో దీన్ని ఇతర ఇండియన్ బాషల్లోనూ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ షోలో వివిధ వయసుల వారు, భిన్నమైన మనస్తత్వం కలిగిన వారు భాగమై ఉంటారు. షోను రక్తి కట్టించడానికి పలు ఆసక్తికర మార్పులు చేస్తూ వస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే లెస్పియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్ జెండర్స్(ఎల్.జి.బి.టి.క్యూ) కమ్యూనిటీకి చెందిన వారికి సైతం ఇందులో చోటు కల్పిస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' షోలో కూడా ఇపుడు ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంటర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రాగానే త్వరలో ప్రారంభం కాబోయే సీజన్ 3పై హైప్ ఒక్కసారిగా పెరిగింది.

Recommended