• 3 years ago
COVID third wave in India is "inevitable" says AIIMS chief Dr Randeep Guleria. Meanwhile All shops can remain open till 5 pm in all these karnataka 16 districts. Public transport, buses and metro services are allowed to ply with 50 per cent capacity. Central government on today wrote states about easing covid 19 curbs amid third wave warnings by aiims chief randeep guleria.


#COVIDThirdWave
#easingcovid19curbs
#AIIMSchiefDrRandeepGuleria
#karnatakaLockdown
#CoronaThirdWaveInevitable
#unlock
#Lockdownstrictrestrictions
#Coronavirusinindia

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గుతోంది. అయితే త్వరలో కరోనా ధర్డ్‌వేవ్ తప్పదంటూ హెచ్చరికలు కూడా మొదలైపోయాయి. ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్‌ ఛీఫ్ రణ్‌దీప్ గులేరియా కరోనా ధర్డ్‌వేవ్ ఆరు నుంచి 8 వారాల్లో తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు పలు రాష్ట్రాలు కరోనా లాక్‌డౌన్‌లను సడలించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం ఇవాళ లేఖలు రాసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి సీఎస్‌లకు లేఖలు వెళ్లాయి. ఇందులో కరోనా ధర్డ్‌వేవ్ ప్రభావంపై తమ వద్ద నున్న సమాచారం చెబుతూనే ... లాక్‌డౌన్‌లు తొలగిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తు చేసింది. లాక్‌డౌన్‌లు తొలగిస్తున్న సమయంలో కరోనా వేళ తాము ఇచ్చిన మార్గదర్శకాలు అమలవుతున్నాయో లేదో నిశితంగా గమనించాలని కేంద్రం సూచించింది.

Category

🗞
News

Recommended