Skip to playerSkip to main contentSkip to footer
  • 12/5/2017
Rain started to drench Mumbai on Monday evening as cyclonic storm Ockhi is just 670 kms southwest of the city. The Maharashtra government has announced holiday for schools and colleges on Tuesday as a precautionary measure.

కేరళలో విధ్వంసం సృష్టించిన ఓఖీ తుపాన్ మహారాష్ట్రను తాకింది. ముంబై దిశగా పయనిస్తుంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓఖీతో మంగళవారం ఉదయం నుంచి ముంబైలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. రాబోయే రెండ్రోజుల్లో తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముంబై నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. రైల్వే స్టేషన్ వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం నాటికి ఓఖీ తపాన్ గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా గుజరాత్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే కేరళలో పర్యటించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుపాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు హరియాణా ప్రభుత్వం రూ. 2 కోట్లు విరాళం ఇచ్చింది.

Category

🗞
News

Recommended