• 3 years ago
The Kerala government confirmed an outbreak of avian influenza in the Alappuzha and Kottayam districts January 4, 2021. Hundreds of ducks have died during the last 10 days in both districts.
#BirdFlu
#NewCoronaStrain
#StrainVirus
#Kerala
#Ducks
#PMModi
#Covid19
#Covid19Vaccine
#Hyderabad

* కరోనా నుంచి ఇంకా కోలుకోక ముందే మరో వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వేలాది పక్షులను బలితీసుకున్న H5N8 వైరస్ (బర్డ్ ఫ్లూ) ఇప్పుడు కేరళలలోనూ ప్రవేశించింది. కేరళలో పెద్ద మొత్తంలో బాతుతు మృత్యువాతపడుతున్నాయి. 8 శాంపిల్స్‌లో ఐదింట H5N8 వైరస్ బయటపడిందని ఆ రాష్ట్ర అటవీ, వన్యప్రాణి సంరక్షణ, పశుసంవర్ధకశాఖ మంత్రి కే.రాజు తెలిపారు. ప్రస్తుతానికి అలప్పుళ, కొట్టాయం ప్రాంతంలోనే ఇది బయటపడిందని వెల్లడించారు. మనుషులెవరికీ ఈ వైరస్ సోకలేదని పేర్కొన్నారు. వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ karananga పెద్ద మొత్తంలో కాకులు, నెమళ్లు, బాతులు, కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు ముందస్తు చర్యలను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే కేరళలో వేలాది పక్షులను చంపేస్తున్నారు. ఇదిలా ఉంటే హిమచల్‌ ప్రభుత్వం బర్డ్‌ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చికెన్‌, గుడ్లు, చేపల విక్రయంపై నిషేధం విధించారు. ప్రజలకు కూడా బర్డ్‌ ఫ్లూ సోకే ప్రమాదం పొంచి ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Category

🗞
News

Recommended