• 3 years ago
Popular Cinematographer 'Garudavega' Anji's direction debut '10th Class Diaries'. This movie teaser released by Producer C Kalyan and Cinematographer Chota K naidu. here is the Garudavega fame Anji , Director of 10th Class Diaries Speech At 10th Class Diaries Teaser Launch Event.
#10thClassDiariesTeaserLaunch
#SrinivasaReddy
#GarudavegaAnji
#Tollywood
#AvikaGor
#Himaja
#టెన్త్ క్లాస్ డైరీస్


చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు.'గరుడవేగ' అంజి మాట్లాడుతూ "మా టీజర్ విడుదల చేసిన ప్రముఖులు అందరికీ ధన్యవాదాలు. నాకు పూర్తిగా సహకరించిన సురేష్ బొబ్బిలి, చిన్నా, ప్రవీణ్ పూడి, ఇతరులు అందరికీ థాంక్స్. ఈ సినిమాకు అవికా గోర్ పెద్ద ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో ఆవిడ పెర్ఫార్మన్స్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. రామారావుగారు చెప్పినట్టు ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం పెరిగింది. '96', 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'కొత్త బంగారు లోకం' కోవలో 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమా ఉంటుంది" అని అన్నారు.

Category

🗞
News

Recommended