• 6 years ago
Kanam in Telugu is a 2018's horror thriller drama film directed by A. L. Vijay and produced by Lyca Productions. The film stars Sai Pallavi and Veronika Arora in the lead role, while Naga Shourya portray of male lead.This movie released on 27 April, 2018. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
ప్రేమమ్ (మలయాళ వెర్షన్), ఫిదా, ఎంసీఏ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న సాయి పల్లవి తాజా చిత్రం కణం. గర్భస్రావం వల్ల పసిగుడ్డుల జీవితాలను చితికేస్తున్న అంశాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందించారు. సందేశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్లాల్సిందే.
తులసి (సాయిపల్లవి), కృష్ణ (నాగశౌర్య) ప్రేమికులు. కాలేజీలో చదుతున్నప్పుడే తొందరపడటం వల్ల తులసి గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న తల్లిదండ్రులు తులసికి అబర్షాన్ చేయిస్తారు. వారి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించి ఐదేళ్ల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. చదువులన్నీ పూర్తయి, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత తులసి, కృష్ణకు పెళ్లి చేస్తారు.
మొదటి భాగంలో తులసి అబార్షన్, ఆ తర్వాత పెళ్లి లాంటి సన్నివేశాలతో చకచక అసలు కథలోకి వెళ్లుంది. తులసి, కృష్ణ దంపతులైన తర్వాత వరుసగా అనుమానాస్పద మరణాలతో సినిమా ఆసక్తిగా మారుతుంది. కథ, కథనాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవ్వడంతో కథలో ప్రేక్షకుడు లీనమైపోతాడు. దియా (బేబీ వెరోనికా) ఎంట్రీతో సినిమా ఎమోషనల్‌గా సాగుతుంది. తన కుటుంబ సభ్యుల మరణాలకు అసలు కారణం తెలియడమనే అంశంతో తొలిభాగానికి బ్రేక్ పడుతుంది.
రెండో భాగంలో తన భార్త ప్రాణాలకు కూడా ముప్పు ఉందనే అంశాన్ని తులసి తెలుసుకోవడం ద్వారా కథను దర్శకుడు ముందుకు తీసుకెళ్తాడు. కథలో ఇంట్రస్టింగ్ అంశాలు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి? ఆలోచింపజేస్తాయి. చివరి 15 నిమిషాలు సినిమాకు ప్రాణంగా నిలుస్తాయి. చక్కటి సందేశంతో కణం సినిమా ఎమోషనల్‌గా ముగుస్తుంది.
#Kanam
#Saipallavi
#Naga Shourya

Recommended