• 3 years ago
గోదావరి పై బ్రిటీషర్స్ కట్టిన తొలి బ్రిడ్జి 125 సంవత్సరాలు పూర్తి చేసుకుంది . 1897 లో నిర్మాణం మొదలుపెట్టిన ఈ బ్రిడ్జి ఇప్పటికీ అంతే దృఢంగా ఉంది . అటు నుండి 1997 వరకూ 100 ఏళ్ల పాటు రైళ్ల రాకపోకలకు సహకరించిన బ్రిడ్జి ప్రస్తుతం గత చరిత్రకు సాక్షిగా నిలిచింది . అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ ఆర్ధర్ ఎలిబ్యాంక్ హేవలాక్ పేరు మీద ఈ బ్రిడ్జ్ కి హేవలాక్ బ్రిడ్జి అనిపేరు వచ్చింది . చాలామంది ఆయనే ఈ బ్రిడ్జి కట్టిన ఇంజనీరు అనుకుంటారు కానీ అది పొరబాటు.ఫ్రెడరిక్ థామస్ వాల్టన్ అనే బ్రిటీష్ ఇంజనీర్ ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు .

Category

🗞
News

Recommended