Man Riding Bike In Front Of Train In Nizamabad : ఓ వ్యక్తి తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యపూర్ రైల్వే గేట్ వద్ద చోటు చేసుకుంది. గేట్ కీపర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు సిబ్బందికి సమాచారం అందించడంతో రైలును ఆపారు. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు దక్కాయి. ఈ బైక్‌ను నడిపిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అరగంట పాటు రైలును అక్కడే ఆపేశారు.
Category
🗞
News