• 2 days ago
Young Man Attacks Auto Driver : ఆటో డ్రైవర్‌పై ఓ యువకుడు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెంగళ్​రావు నగర్‌ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానికులు రక్షించడంతో దాడి నుంచి బయటపడ్డ ఆటో డ్రైవర్‌, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెంగళ్​రావు నగర్‌ ప్రాంతంలో ఓ యువకుడు ఆటో డ్రైవర్‌ను సైడ్‌ ఇవ్వమని అడిగాడు. అందుకు సమాధానంగా ఆటోడ్రైవర్‌ 'అన్న ప్లేస్‌ ఉంది. కొంచెం అటువైపు నుంచి నెమ్మదిగా వెళ్లు' అని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఆటోడ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరిగి తీవ్రస్థాయికి చేరుకుంది. వెంటనే యువకుడు ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు.

ఆటో డ్రైవర్‌ను విచక్షణారహితంగా చితకబాదాడు. ముఖం, కడుపుపై పిడిగుద్దులు గుద్దుతూ దారుణంగా ప్రవర్తించాడు. దెబ్బలకు తాళలేక ఆటో డ్రైవర్ ఆర్ధనాదాలు చేశాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆటో డ్రైవర్‌ను రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి స్థానికులను, ఆటో డ్రైవర్‌ను దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Category

🗞
News
Transcript
01:30Thanks for watching.

Recommended