• 14 hours ago
Loan App Recovery Agents Arrest : ఈఎంఐ(EMI) డబ్బులు కట్టలేదని ఓ యువతి న్యూడ్​ ఫొటోలను కుటుంబ సభ్యులకు షేర్​ చేసిన ఇద్దరు రికవరీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగింది. అంతకుముందు యువతి బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి లోన్​ డబ్బులు చెల్లించలేదని దుర్భాషలాడారని పోలీసులు తెలిపారు. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వెల్లడించారు.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్​ నగరంలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా వర్క్​ చేస్తోంది. ఆరు నెలల కిందట ఆమె ఫినబుల్​ అనే లోన్​ యాప్​లో ఈఎంఐ పద్ధతిలో లోన్​ తీసుకుంది. సమయానికి ఆమె ఈఎంఐ చెల్లించలేదు. దీంతో డబ్బులు చెల్లించకపోతే యువతి ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు ఆమెను బెదిరించారు. అంతే కాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులను కూడా ఫోన్​ చేసి డబ్బులు కట్టలేదని నోటికి వచ్చినట్లు దూషించారు.

Category

🗞
News
Transcript
00:00Pinnapur Technologies Company Limited, registered loan app.
00:05This loan app persons, a young man from Sulurpet,
00:09was working as a software engineer in Hyderabad,
00:12and took a loan.
00:14After paying 5 times,
00:16for the 6th time,
00:17he said he didn't pay the installment,
00:19called his brother, his mother, and scolded them.
00:23We said we will send nude photos to her contacts,
00:27and sent messages to her.
00:30We sent some photos to his brother.
00:34There are different ways to collect money.
00:37Without being followed,
00:39in a threatening manner,
00:41using this cyber crime,
00:43as it was a crime,
00:45we arrested him.
00:46Without verification,
00:47we said we will give the loan,
00:49and took the loan.
00:50After that,
00:51for their torture,
00:53it shouldn't be a problem.
00:56If we inform the police,
00:58they will take the loan.

Recommended