Lavanya in Narsingi Police station : డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న లావణ్య మరోసారి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. శేఖర్‌బాషాపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా ప్రయత్నిస్తున్నారని లావణ్య పేర్కొన్నారు. తన వద్ద మొబైల్లో ఉన్న ఆడియో సంబంధిత ఆధారాలను పోలీసులకు ఆమె అందజేశారు. 140 గ్రాముల డ్రగ్స్‌ను తన ఇంట్లో పెట్టి ఇరికించేందుకు తనపై కుట్ర చేస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Category
🗞
News