Vijayawada Police Arrest Five Accused involved in Illegal Selling Infants : పసి పిల్లల్ని అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్న ఘరానా లేడీ ముఠాను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ముగ్గురు శిశువులను రక్షించారు. విజయవాడ సితార సెంటర్‌కు చెందిన బలగం సరోజినీ ఆధ్వర్యంలో ముఠా ఏర్పాడినట్లు విజయవాడ సీపీ రాజశేఖర్ తెలిపారు. వీరంతా దిల్లీ, అహ్మదాబాద్ నుంచి శిశువులను తెచ్చి రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు చెప్పారు. సరోజినీతోపాటు షేక్ ఫరీనా, సైదాబీ, కరుణ శ్రీ, శీరిషను అరెస్టు చేసి వారి వద్ద 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
Category
🗞
News