• 2 days ago
Case On YSRCP MLC Botsa Satyanarayana : అమరావతిని శ్మశానమని దూషించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని వెలగపూడి రైతు కంచర్ల జగన్ మోహన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 3న శాసనమండలి, పాత్రికేయుల సమావేశాల్లో మాట్లాడుతూ గతంలో రాజధాని అమరావతిని శ్మశానం అన్నానని ఇప్పటికీ తాను అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు పదే పదే చెప్పడంతో మనస్సు కలిచివేసిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Category

🗞
News

Recommended