గబ్బర్‌‌సింగ్ గణేష్‌ ఛాన్స్ కొట్టాడు !

  • 7 years ago
Choreographer Ganesh Master is Known for best Dances in Tollywood. He Choreographed like Gabbar singh song. He worked with Pawan Kalyan, Allu Arjun, Jr NTR ect., Recently he got Bharat World Record's Best Talented Award for 2016-17. In this occassion, He expressed his happyness over Award.

గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ కంపోజ్ చేయడం ద్వారా కొరియోగ్రాఫర్ గణేష్ కాస్త.. గబ్బర్ సింగ్ గణేష్ అయ్యాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా నృత్యాలు సమకూర్చడంలో గణేష్‌ది ప్రత్యేకమైన స్టయిల్. కేవలం పవన్‌కే కాదు.. టాలీవుడ్‌లో అగ్ర నటుల సూపర్ హిట్ పాటలకు గణేష్ కొరియోగ్రఫీ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు సేవ చేస్తున్న గణేష్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది..
తాజాగా భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రతీ ఏడాది అందించే బెస్ట్ టాలెంటెడ్ అవార్డును 2016-2017కు గాను ప్రముఖ కొరియోగ్రాఫర్ ''గబ్బర్ సింగ్'' గణేష్ మాస్టర్‌ అందుకున్నారు. సినీ మరియు టీవీ రంగాలలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రం తరపున గణేష్ మాస్టర్‌కు బెస్ట్ టాలెంటెడ్ అవార్డును మాజీ ముఖ్యమంత్రి , తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య, భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి లయన్ డా.కె వి రమణారావులు నమోదు పత్రాన్నిఅందజేశారు.ప్రముఖ దర్శకులు, దివంగత దాసరి నారాయణరావు ఆశీస్సులు, ప్రోద్బలంతో ‘ఒసేయ్ రాములమ్మా' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు గణేష్ కొరియోగ్రాఫర్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.
అవార్డు అందుకొన్న సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. తనకు రావడం చాలా ఆనందంగా ఉంది. తన సేవలకు సరైన గుర్తింపు లభించింది. ఈ స్ఫూర్తితో మరింత మెరుగైన నృత్యాలను సమకూరుస్తాను అని గణేష్ మాస్టర్ తెలిపారు.

Recommended