• 6 years ago
In an interview, Singer Niranjana Ramanan has said that " when she received a call from the young composer and recorded Swagatham Krishna, she didn’t know it was for a film.

సినిమా పాటల విషయంలో దర్శకుల అభిరుచి మారుతోంది. ఫాస్ట్ బీట్ సాంగ్స్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చారో.. ఇటీవలి కాలంలో సాంప్రదాయ బాణీలకు అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్తారింటికి దారేదిలో 'దేవం భజే..', అర్జున్ రెడ్డిలో 'సుమనస వందిత', తాజాగా అజ్ఞాతవాసిలో 'మధురాపురి సదనా' వంటి సాంప్రదాయ గీతాలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది.
అజ్ఞాతవాసిలో 'మధురాపురి సదనా' పాట ఇప్పుడు చాలామంది రింగ్ టోన్ గానూ మారిపోయింది. ఈ పాటతో సింగర్ నిరంజనా రమణన్‌కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే తనతో ఈ పాట పాడించినప్పుడు.. ఇది అజ్ఞాతవాసి సినిమాలో పెట్టబోతున్నారన్న విషయం అసలు ఆమెకు తెలియదట. తెలుగులో పాట పాడే అవకాశం గురించి నిరంజనా చెప్పిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే...
ఓరోజు అనిరుధ్‌ రవిచంద్రన్‌ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆఫీసుకు రమ్మంటే వెళ్లాను. అక్కడే 'స్వాగతం కృష్ణా..' లిరిక్స్ ఇచ్చి పాడించారు. అయితే అది సినిమా కోసం చేస్తున్న రికార్డింగ్ అని నాకప్పటికీ తెలియదు. కర్ణాటక సంగీతంతో కూడిన సాంగ్స్ ఈరోజుల్లో సినిమాల్లో ఎవరు పెట్టట్లేదు కదా!.. అందుకే ఆ ఛాన్స్ లేదనుకున్నాను.
సాంగ్ రికార్డ్ చేసిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ పాట పవన్‌కల్యాణ్‌ సినిమాలో పెట్టబోతున్నారని. ఆ తర్వాత అదే పాట 'అజ్ఞాతవాసి' టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వినిపించడంతో షాకయ్యాను. కానీ నా జీవితంలో చాలా సంతోషాన్నిచ్చిన పాట ఇది. కేవలం 90నిమిషాల్లోనే రికార్డింగ్ పూర్తి చేశాం.

Recommended