• 7 years ago
Dil Raju Review on Krishnarjuna Yudham. Krishnarjuna Yudham film written and directed by Merlapaka Gandhi and starring Nani, in dual role.

నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'కృష్ణార్జున యుద్ధం'. అనుపమ పరవేుశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్. మేర్లపాక గాంధీ దర్శకుడు. వెంకట్ బోయినపల్లి సమ‌ర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దిల్ రాజు ఈ సినిమా గురించి ముందే రివ్యూ చెప్పేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
దిల్‌రాజు మాట్లాడుతూ... ‘‘కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని మాకు రిలీజ్ చూసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నాం. దర్శకుడు మేర్లపాక గాంధీ నాకు ముందే పరిచయం. చోటా ద్వారా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' కథ చెప్పేందుకు మా ఆఫీసుకు వచ్చాడు. అపుడు హరీష్ శంకర్ నేను లైన్ విన్నపుడు చాలా సింపుల్ కథ అనిపించింది. కానీ అది విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయింది. అలాగే ఆయన తీసిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా' రిలీజ్ ముందే చూశాను. అదీ అంతే... సింపుల్ క్యారెక్టరైజేషన్‌తో ఎంటర్టెన్మెంట్ చేస్తూ సూపర్ హిట్ చేశాడు. అన్నారు.
గాంధీలో నేను గమనించిన విషయం క్యారెక్టరైజేషన్స్, ఎంటర్టెన్మెంట్, మ్యూజిక్ ప్యాకేజ్ చేసి పెద్ద స్ట్రెయిన్ తీసుకోకుండా ఆడియన్స్‌‌ను ఎంటర్టెన్ చేస్తున్నాడు. ఇపుడు కృష్ణార్జున యుద్ధం.... నేను నాని కలిసి మూడు రోజుల క్రితం చూశాం. సింపుల్‌గా కృష్ణ, అర్జున్ క్యారెక్టరైజేషన్స్ రాసుకుని నాన్ స్టాప్ ఎంటర్టెన్ చేస్తూ ఒక చిన్న కథను రన్ చేస్తూ మళ్లీ ప్రేక్షకుల ఈ సమ్మర్ సీజన్లో మంచి వినోదం అందించబోతున్నాడు.... అని దిల్ రాజు తెలిపారు.
ఫస్టాఫ్ హిలేరియస్ ఎంటర్టెన్మెంటుతో ఫుల్ ఎంజాయ్ చేశాను. సెకండాఫ్‌లో కథలోకి వచ్చినపుడు ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కొంత ఎంటర్టెన్మెంట్ తగ్గినా సినిమా చూసి బయటకు వచ్చేపుడు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా ఎలా ఫీలయ్యానో ఈ సినిమాకు అలాగే ఫీలయ్యాను. ఈ సినిమా ద్వారా గాంధీ హాట్రిక్ కంప్లీట్ చేయబోతున్నాడు.... అని దిల్ రాజు అన్నారు.

Recommended