• 8 years ago
Tamil super star Rajinikanth does not want to repeat Megastar Chiranjeevi's Prajarajyam failure.

యుద్ధరంగంలోకి దిగితే గెలిచే తీరాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అందుకు జనాకర్షణ ఒక్కటే సరిపోదని, పక్కా ప్లాన్ ఉండాలని కూడా ఆయన భావిస్తున్నారు. వాపు చూసి బలం అనుకుంటే తప్పు చేయడమే అవుతుందనేది ఆయన ఆలోచన. తన ఆలోచననే ఆయన మంగళవారం అభిమానులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. ప్రజారాజ్యం విషయంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన పొరపాటు చేయకూడదని ఆయన అనుకుంటున్నారు. చిరంజీవి వైఫల్యాన్ని గుణపాఠంగా స్వీకరించాలనేది కూడా ఆయన మతంగా కనిపిస్తోంది.

రజనీకాంత్ తమిళనాడులో సొంత పార్టీయే పెడుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర పార్టీలతో పొత్తు కూడా ఉండదని అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెసు నేత కరాటే త్యాగరాజన్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తనకు తెలిసి రజనీకాంంత్ సొంత పార్టీయే పెడతారని ఆయన అన్నారు. తన దారి రహదారి అనే విషయం ఇప్పటికే చెప్పారని, అందువల్ల ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోరని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్ బిజెపితో కలిసి నడిచే అవకాశం కూడా లేదని కరాటే త్యాగరాజన్ అన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బిజెపికి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాని, దీన్ని బట్టి చూస్తే రజనీకాంత్ కమలతో దోస్తీ కట్టే అవకాశాలు కూడా లేవని అభిప్రాయపడ్డారు. ఆయన బిజెపితో పొత్తు పెట్టుకుంటారని గతంలో ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కారణంగా ఆ ప్రచారం సాగింది. మెగాస్టార్ చిరంజీవి మాదిరిగా హడావిడిగా రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని, అందుకు అవసరమైన వ్యూహరచన చేసిన తర్వాతనే రాజకీయ ప్రవేశం చేస్తారని త్యాగరాజన్ అన్నారు. ముందు తన అభిమానుల్ని, అభిమాన సంఘాల్ని కట్టడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

Category

🗞
News

Recommended