'పద్మావత్' థియేటర్లపై కర్ణిసేన దాడులు.. పరిస్థితి చేజారుతోందా ?

  • 6 years ago
Dozens of people, believed to be Karni Sena members, vandalised a mall and torched vehicles in Gujarat’s Ahmedabad on Tuesday evening, to protest against the release of the film Padmaavat,

న్యాయపరంగా 'పద్మావత్‌' విడుదలను అడ్డుకోలేకపోయినా.. హింసాత్మక ఆందోళనల ద్వారా సినిమాను అడ్డుకోవడానికి కర్ణిసేన ప్రయత్నిస్తోంది. చిత్ర విడుదల వేళ.. గుజరాత్, రాజస్థాన్‌లో కర్ణిసేన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ను ధ్వంసం చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
గుజరాత్‌, అహ్మదాబాద్‌లో 'పద్మావత్' సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పై కర్ణిసేన వర్గాలు దాడులకు దిగాయి. సినిమా విడుదలకు సిద్దమవుతున్న హిమాలయ, అహ్మదాబాద్‌ వన్‌ మాల్స్‌, మరో సినిమా థియేటర్‌ను కర్ణిసేన కార్యకర్తలు తగలబెట్టేశారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో, రోడ్లపై ఉన్న సుమారు 150 వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టడం గమనార్హం.
ఆందోళనలు శ్రుతిమించుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేయక తప్పలేదు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్రంలో కర్ణిసేన ఆందోళనలపై డీజీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
కర్ణిసేన దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని భద్రతా బలగాలను మోహరించారు. ప్రధానంగా 'పద్మావత్' ప్రదర్శించబోయే థియేటర్లకు భద్రత పెంచారు. రాష్ట్రంలో ఆందోళనలపై సీఎం విజయ్ రూపానీ కూడా స్పందించారు. అందరూ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Recommended