• 6 years ago
South India woke up to a headline in The New Indian Express on Friday that led to an outrage on Twitter and Facebook. “Dalit outreach with Ilaiyaraaja’s Padma”, the newspaper said.

మనదేశంలో ఏదీ కులమతాలకు అతీతంగా జరగదన్న భావన చాలా బలంగా పాతుకుపోయింది. పలానా వ్యక్తికి అవార్డు వచ్చిందంటే.. వెంటనే ఆ వ్యక్తిది 'ఏ కులం' అని సెర్చింజన్‌లో వెతికే సమాజం మనది. కులమతాలకు వ్యతిరేకంగా పోరాడినవాళ్లకు సైతం కులం తోకలు తగిలించేయడమూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మ్యూజిక్ మేస్ట్రో 'ఇళయరాజా'పై కూడా కుల ముద్ర పడక తప్పలేదు.
దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ఇళయరాజాను వరించిన సందర్భంలో.. 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఒక కథనాన్ని ప్రచురించింది. 'ఇళయరాజా పద్మ అవార్డుతో దళితులను ఆకట్టుకునే ప్రయత్నం' అన్న హడ్‌లైన్‌తో ప్రచురితమైన ఆ కథనం వివాదాస్పదంగా మారింది.
జిగ్నేశ్ మేవాని లాంటి వ్యక్తుల నాయకత్వంలో దళిత ఉద్యమాలు మరోసారి ఉధృతమవుతున్న తరుణంలో.. ఆ కమ్యూనిటీ ఎటెన్షన్‌ను తమవైపు మళ్లించేందుకే ఇప్పుడు ఇళయరాజాకు ఈ అవార్డు ప్రకటించారని 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.
'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనంపై దిగ్గజ దర్శకుడు భారతీరాజా చేసిన కామెంట్స్ మరింత వివాదాస్పదంగా మారాయి. 'ఇళ‌య‌రాజా ద‌ళితుడు కావ‌డం వ‌ల్లే అవార్డు వ‌చ్చిందని కొంద‌రు అంటున్నారు. మరోవైపు ఇళ‌య‌రాజా మాత్రం తననో బ్రాహ్మాణుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికే ఆరాటపడుతున్నారు' అంటూ భారతీరాజా కామెంట్ చేశారు.

Recommended