హీరో, దర్శకుల కలయిక.. సెన్సేషనల్ కాంబినేషన్స్

  • 7 years ago
Tollywood's film making dynamics are changing.There rare combinations are setting to hit the silverscreen. Rajmouli, Boyapati Srinu, Koratala Shiva, VV Vinayak are getting ready with telugu superstars NTR, Ram charan, Mahesh ect., These combination are at discussion and script level.

బాహుబలి తర్వాత టాలీవుడ్ ప్రతిష్ఠ అమాంతం పెరుగడంతో ఇప్పడు తెలుగు సినిమాల మార్కెట్ జాతీయస్థాయిలో ఘనంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు టాలీవుడ్ ప్రముఖ హీరో, దర్శకులు. ఈ క్రమంలో రేర్ కాంబినేషన్లకు తెరలు లేస్తున్నాయి. ఇప్పుడు కొరటాల, శివతో మహేశ్ సినిమా, సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్‌లో సెట్‌పైన ఉన్నాయి. ఇక త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఇలాంటి కాంబినేషన్ల నేపథ్యంలో మరి కొన్ని క్రేజీ కాంబినేషన్లు సిద్ధమవుతున్నాయి.
శ్రీమంతుడు సినిమాకు ముందే అల్లు అర్జున్‌ కోసం కొరటాల శివ స్క్రిప్టు సిద్ధం చేశాడట. కథను కూడా స్టైలిష్ స్టార్‌కు వినిపించాడట. అయితే ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదట. మళ్లీ ఈ మధ్య అల్లు అర్జున్‌కు కొరటాల శివ ఓ విభిన్నమైన కథను వినిపించడం, ఆ చిత్రాన్ని నిర్మించడానికి దిల్ రాజు ముందుకు రావడం జరిగిందట. త్వరలోనే అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ వస్తుందని సినీ వర్గాల సమాచారం.
దర్శకుడు సుకుమార్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రంగస్థలం చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత రాంచరణ్ నటించబోయే సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రం అని ఫిలింనగర్ టాక్.
వాస్తవానికి కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా అనుకొన్నారు. ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో అది వెనక్కు వెళ్లినట్టు సమాచారం. ఎన్టీఆర్‌తో సినిమాపై క్లారిటీ లేకపోవడం వల్ల అక్కినేని అఖిల్‌తో కొరటాల శివ జతకట్టనున్నారనేది లేటేస్ట్ న్యూస్. విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న హాలో చిత్రం తర్వాత అఖిల్ చేయబోయే సినిమా అదే అంటున్నారు.

Recommended