• 7 years ago
Actor Samrat Reddy has been taken into police custody since last night following a complaint from his wife in a dowry case. Samrat's wife Harshita Reddy has lodged a case against Samrat that he is demanding her for dowry. Cops have taken Samrat in to custody and probing the issue.

హర్షిత తన కొడుకును మానసింగా హింసించిందని నటుడు సామ్రాట్ రెడ్డి తల్లి జయా రెడ్డి అన్నారు. హర్షిత కుటుంబ సభ్యులతో రాజీకి తాము సిద్ధమని చెప్పారు. పెళ్లయినప్పటి నుంచి తన కొడుకు నరకం అనుభవిస్తున్నాడని వాపోయారు.
తన కొడుకు సామ్రాట్ రెడ్డి సినిమాల్లో నటించడం హర్షితకు ఇష్టం లేదని చెప్పారు. మానసికంగా హింసించారన్నారు. తన కొడుకు ఎవరితో మాట్లాడినా హర్షిత అనుమానించేదని ఆరోపించారు. అంతకుముందు, సామ్రాట్ కూడా హర్షిత ఆరోపణలను కొట్టి పారేశారు. ఒక చిన్న మెసేజ్ వల్ల తన భార్య తనను నానా కష్టాలు పెట్టిందని ఆరోపించారు. తాను ఆమెను వేధించలేదని చెప్పారు. తన భార్యే తనను వేధించిందన్నారు. ఆమెతో సర్దుబాటుకు తాను ప్రయత్నించానని, కానీ వాళ్ల డిమాండ్స్ భారీగా ఉన్నాయని సామ్రాట్ చెప్పారు. అంత ఇచ్చుకునే స్థోమత తన వద్ద లేదన్నారు. తాను ఇంట్లో నుంచి నగలు దొంగిలించానని హర్షిత చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆ ఇంట్లో తనకు కావాల్సిన వస్తువులను తాను తీసుకున్నానని సామ్రాట్ రెడ్డి చెప్పారు. అయితే కోపంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం మాత్రం తన తప్పే అన్నారు.
ఇదిలా ఉండగా, నటుడు సామ్రాట్‌ను పోలీసులు సాయంత్రం ఐదు గంటల సమయంలో మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. అతనికి న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విదించింది. ట్రెస్ పాస్, చోరీ ఐపీసీ సెక్షన్ 380, 427 ఆర్/డబ్ల్యు, 201 కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు, సామ్రాట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు బుధవారానికి వాయిదా పడింది.

Category

🗞
News

Recommended