• 6 years ago
The bodies of a young woman, her mother and four-year-old daughter were found in their apartment on Hyderabad's outskirts on Monday, police said. The young woman's estranged husband is the accused in the case.

నగరంలోని చందానగర్‌లో జరిగిన మూడు హత్యల కేసులో సోమవారం లొంగిపోయిన నిందితుడు మధు.. పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించాడు. తన ప్రియురాలు అపర్ణ, ఆమె తల్లి విజయలక్ష్మి, తమ కూతురు కార్తీకేయను దారుణంగా హత్య చేసినట్లు మధు అంగీకరించాడు.
హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులకు వెల్లడిస్తూ.. జనవరి 27న ఉదయం 11.30గంటలకు చందానగర్‌లోని అపర్ణ ఇంటికి వెళ్లినట్లు మధు తెలిపాడు. అక్కడ విజయలక్ష్మి తనను నిలదీసిందంటూ.. అపర్ణకు అన్యాయం చేయొద్దని కోరిందని తెలిపాడు. ఈ నేపథ్యంలో పెనుగులాట జరిగిందని చెప్పాడు. ఆ తర్వాత విజయలక్ష్మిని టవల్‌తో ఊపిరాడకుండా చేసి చంపేశానని మధు తెలిపాడు.
కాగా, తన అమ్మమ్మను చంపొద్దంటూ తన కూతురు కార్తికేయ వేడుకున్నా మధు వినిపించుకోలేదు. అనంతరం అదే కోపంలో కన్న కూతురు అని కూడా చూడకుండా కార్తీకేయను కూడా గొంతునులిమి చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఆ తర్వాత అనుమానం రాకుండా వారిని బెడ్‌పై పడుకోబెట్టాడు మధు. అనంతరం హాలు టీవీ చూస్తూ కూర్చుండిపోయాడు.
శనివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో విధులు ముగించుకుని వచ్చిన అపర్ణ.. కూతురు, తల్లి మృతి చెందడంతో మధుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అపర్ణను వంటగదిలో బలమైన వస్తువుతో బాది, గోడకేసి కొట్టాడు మధు. దీంతో ఆమె పెద్ద కేకలు వేస్తూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.కాగా, అపర్ణ కేకలు విన్న పొరుగు మహిళ.. అపర్ణ ఇంటి వద్దకు రాగా.. లోపలికి గడియి పెట్టి ఉండటం, టీవీ సౌండ్ వినిపించడంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. ముగ్గురిని హత్య చేసిన హంతకుడు మధు.. ఆ తర్వాత సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో అపర్ణ ఇంటికి తాళం వేసి అక్కడ్నుంచి పరారయ్యాడు.

Category

🗞
News

Recommended